అయోధ్య తీర్పు ఎలా ఉన్నా నిరసనలు, ప్రకటనలు చేయరాదు: కేంద్ర హోం శాఖ

అయోధ్య అంశం విశ్వాసాలతో ముడిపడిన సెన్సిటివ్ ఇష్యూ కావడంతో కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ ప్రకటించాయి. తీర్పు నేపథ్యంలో సీజేఐ గొగోయ్ నిన్న ఉత్తరప్రదేశ్ సీఎస్, డీజీపీలను పిలిపించుకుని తాజా పరిస్థితిని, ముందస్తు ఏర్పాట్లను అడిగి తెల్సుకున్నారు. అయోధ్య తీర్పుకు అనుకూలంగా కానీ, వ్యతిరేకంగాకానీ ర్యాలీలు, నిరసనలు, ప్రకటనలు, పోస్టులు చేయరాదంటూ కేంద్ర, రాష్ట్రాల హోం శాఖలు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. తీర్పు ఎలా ఉన్నప్పటికీ  ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలెవరూ టీవీ డిబేట్లతో మాట్లాడొద్దని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలిచ్చింది. సుప్రీంతీర్పును అంగీకరిస్తామని అందరు పిటిషనర్లు, అన్ని వర్గాల ప్రతినిధులు ప్రకటించారు. ఫైనల్ జడ్జిమెంట్ పై క్యూరేటివ్ పిటిషన్లకు అవకాశం కల్పించడం తప్ప బెంచ్ తీర్పులో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. యూపీ, ఢిల్లీలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవు ప్రకటించారు.

Image result for amit shah

Latest Updates