రామమందిర నిర్మాణం భూమి పూజకు ముస్లిం కు ఆహ్వానం

అయోధ్య భూవివాదంలో వ్యాజ్యం వేసిన ఇక్బాల్‌ అన్సారీకి కూడా రామాలయ భూమిపూజ ఆహ్వాన పత్రిక అందింది. శ్రీరాముడి ఆశీస్సుల వల్లే తనకు ఆహ్వాన పత్రిక అంది ఉంటుందని ఇక్బాల్‌ అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టడం అంటే.. ఈ పట్టణ ప్రజలు అభివృద్ధికి నోచుకోవడమే అన్నారు. అయోధ్యలో ఆలయాన్ని నిర్మించడాన్ని స్వాగతిస్తున్నానని, ఇక్కడ పరస్పర సహకారం ఉందని, వివక్ష లేదని, ఆలయ నిర్మాణం వల్ల పాజిటివ్‌ సెంటిమెంట్‌ వ్యాపిస్తుందని, కొత్త ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో అయోధ్యలో బోలడన్ని పరిశ్రమలు ఏర్పాడుతాయని ఇక్బాల్‌ అభిప్రాయపడ్డారు.

1952లో అయోధ్య భూవివాదంపై అయిదుగురు ముస్లింలు కేసు వేశారు. రామ్‌లల్లా విరాజితులైన ప్రదేశంలో బాబ్రీ మసీదు ఉన్నట్లు ఈ అయిదుగురూ కోర్టును ఆశ్రయించారు. దాంట్లో హసిమ్‌ అన్సారీ ఒకరు. ఆయన కుమారుడే ఇక్బాల్‌ అన్సారీ. మహంతి జ్ఞాన్‌దాస్‌తో ఇక్బాల్‌ తండ్రికి మంచి స్నేహం ఉండేది. ప్రస్తుతం ఇక్బాల్‌ అన్సారీ ఓ చిన్న షాపు నడుపుతున్నాడు. అయితే బాబ్రీ కేసులో ఇక్బాల్‌ తరపున ఆల్‌ ఇండియా ముస్లిం లా బోర్డు, సున్నీ బోర్డు, బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీలు ఖర్చులు భరించాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇక్బాల్‌ గౌరవించారు.

Latest Updates