వందల ఏళ్ల ఆశలకు వెండి పునాది

  • ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన
  • రామ్ లల్లాకు సాష్టాంగ నమస్కారం చేసిన పీఎం
  • అంతకుముందు హనుమాన్ గఢిలో పూజలు
  • ఉప్పొంగిన అయోధ్య.. మార్మోగిన జై శ్రీరామ్ నినాదాలు
  • దేశవ్యాప్తంగా రామాలయాల్లో పూజలు
  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి హాజరు

తరతరాల కల నిజమైంది. లోకమంతా రామనామ స్మరణ జేస్తుండగా..అయోధ్యలో గుడికి వెండి ఇటుకతో పునాది పడింది. ఇన్నాళ్లూ టెంట్ కింద ఉన్న రాములోరికి త్వరలోనే భవ్య మందిరం సిద్ధంకానుంది. సరయూ నది తీరంలో సీతా సమేతంగా ఏకకాలంలో పదివేల మంది భక్తులకు లోకాభిరాముడు దర్శనమివ్వనున్నాడు. సాధుసంతుల సమక్షంలో బుధవారం మధ్యాహ్నం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థా పన చేశారు. అంతకు ముందు ఆయన హనుమాన్ గఢీలో ప్రత్యేక పూజలు చేసి, రామ్ లల్లాను దర్శించుకొని సాష్టాంగనమస్కారాలు చేశారు. పారిజాత మొక్కను నాటారు. కరోనా కారణంగా అతి తక్కువ మందినే వేడుకకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానించింది.

వందల ఏళ్ల  సంకల్పానికి పునాది పడింది. కోట్ల మంది ఆశలు నిజమయ్యాయి. 30 ఏళ్లుగా సాగుతున్న బీజేపీ పోరాటానికి విజయవంతమైన ‘ముగింపు మొదలైంది’. రామసక్కని ఆలయనిర్మాణానికి తొలి అడుగు పడింది. వేదమంత్రాల నడుమ… ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామ మందిరానికిభూమి పూజ జరిగింది. భజనలు, శ్లోకాలమధ్య పునాది రాయి పడింది. ఈ ఉత్సవంతో అయోధ్యానగరి ఉప్పొంగింది. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై, హర హర్మహాదేవ్ నినాదాలు మారుమోగాయి.

ఢిల్లీ టు అయోధ్య వయా లక్నో..

ఢిల్లీనుంచి బుధవారం ఉదయాన్నే ఎయిర్ ఫోర్స్ విమానంలో లక్నోకు ప్రధాని మోడీ చేరుకున్నారు. అక్కడి నుంచి అయోధ్యకు హెలికాప్టర్ లో వెళ్లారు. సంప్రదాయ ధోవతి, కుర్తాలో వచ్చిన ప్రధానిని.. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆహ్వానిం చారు. అక్కడి నుంచి హనుమాన్ గఢి టెంపుల్కు వెళ్లిమోడీ పూజలు చేశారు. కొద్ది సేపటి తర్వాత రామ జన్మభూమి ప్రాంతానికి వెళ్లి ‘భగవాన్ శ్రీ రాంలల్లావిరాజ్ మాన్’ దగ్గ ర పూజలు చేశారు. అక్కడ పారిజాత మొక్కను నాటారు.

పోస్టల్ ఆవిష్కరణ

అయోధ్యలో భూమి పూజ జరుగుతున్న సమయం లోనే దేశవ్యాప్తంగా రామాలయాల్లో పూజలు జరిగాయి. తర్వాత గుడి నిర్మాణ శిలాఫలాకాన్ని మోడీ ఆవిష్కరించారు. రామ మందిర నిర్మాణానికి చిహ్నంగా పోస్టల్ స్టాంప్‌‌ను విడుదల చేశరు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రామ్ జన్మభూమి తీరక్షేత్ర ట్రస్ట్ హెడ్ న`త్యగోపాల్ దాస్ తదితర ప్రముఖులు, భారీగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా వ్యాప్తినేపథ్యంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో పాటు చాలా మందిని కార్యక్రమానికి పిలవలేదు. మోడీ, ఇతర ప్రముఖులంతా మాస్క్ లు వేసుకుని, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.

సాష్టాంగ నమస్కారం

రామ్ లల్లాదగ్గ రికి రాగానే మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత స్వామికి హారతిచ్చి..ప్రదక్షిణ చేశారు. ఆతర్వాత భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నా రు. మందిర నిర్మాణానికి అభిజిత్ ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12.44 నిమిషాలకు వెండి ఇటుకను మోడీ ప్రతిష్ఠ చేశారు. నక్షత్ర ఆకారంలో ఉన్న5 వెండి ఇటుకలను వినియోగించారు. తర్వాతదేశంలోని వివిధ పుణ్య నదులు, క్షేత్రాల నుంచితీసుకొచ్చిన జలాలు, మట్టిని ఉంచారు.

దారులన్నీ కాషాయమయం.

అయోధ్యకు వెళ్లేదారులన్నీ హోరిం్డ గులు, బ్యానర్లతో నిండిపోయాయి. దారిపొడవునా షాపులన్నీ కాషాయమయమయ్యాయి. సరయూ తీరం సందడిగా కనిపించింది. అయోధ్య వీధులు రామ భక్తులు,ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలతో నిండి పోయాయి.పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest Updates