రిపబ్లిక్ డే పరేడ్ లో అయోధ్య రామమందిర శకటం

జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో అయోధ్య రామమందిర శకటం కనువిందు చేయనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం నమూనాను ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతోపాటు దీపోత్సవాన్ని ప్రతిబింబింప చేసే నమూనాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ శకటాన్ని రూపొందించనుంది. ‘కల్చరల్ హెరిటేజ్ ఉత్తరప్రదేశ్’ పేరుతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందించనున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమ శకటానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసిందని చెప్పింది.

Latest Updates