ట్విట్టర్లో అయోధ్య తీర్పు టాప్

న్యూఢిల్లీ: అయోధ్య తీర్పు.. దేశంలో ప్రస్తుతం ఇదే ట్రెండింగ్​. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్​ అవుతున్న హాట్‌ టాపిక్​గా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నెటిజన్లు వివిధ హాష్​ట్యాగ్​లతో అయోధ్య తీర్పుపై టాపిక్​లను ట్రెండింగ్​లోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టాప్​ 10 ట్రెండింగ్​లలో 5, ఇండియాలో పదికి పది టాప్​ ట్రెండింగ్​ టాపిక్​లు అయోధ్య తీర్పుపైనే ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా #AyodhyaVerdict హాష్​ట్యాగ్​ టాప్​లో నిలిచింది. ఐదున్నర లక్షలకుపైగా ట్వీట్లతో ఫస్ట్​ప్లేస్​ సాధించింది. ప్రపంచంలో ట్రెండ్​ అయిన టాప్​ 5 టాపిక్​లలో అయోధ్య తీర్పుపైనే నాలుగు హాష్​ట్యాగ్​లున్నాయి.

ఇక, ఇండియాలో#BabriMasjid, ayodhyaJudgement, #Ramjanmabhoomi, #RamMandir వంటివి ట్రెండ్​ అయ్యాయి. మన దగ్గర అత్యంత ఎక్కువగా ట్రెండ్​ అయిన అంశాల్లో #RamMandir రెండో స్థానంలో నిలిచింది. ఆ హాష్​ట్యాగ్​తో లక్షా 60 వేలకు పైగా ట్వీట్లు వెళ్లాయి. ఇక, అయోధ్యతీర్పును పేర్కొంటూ సుప్రీంకోర్టు హాష్​ట్యాగ్​తోనూ 2 లక్షల ట్వీట్లు చేశారు నెటిజన్లు. సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​ రంజన్​ గొగోయ్​ ఆధ్వర్యంలోని కాన్​స్టిట్యూషనల్​ బెంచ్​ అయోధ్యపై తీర్పు ఇవ్వడంతో, ఆయన పేరు మీద #RanjanGogoi హాష్​ట్యాగ్​ కూడా ట్రెండ్​ అయింది. #HinduMuslimBhaiBhai హాష్​ట్యాగ్​తో 30 వేలకు పైగా ట్వీట్లు చేశారు.

Latest Updates