ఆయుష్ మినిస్టర్‌‌ శ్రీపాద నాయక్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌కు కరోనా సోకింది. తాను హోం క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు బుధవారం నాయక్ ట్విట్టర్‌‌ ద్వారా తెలిపారు. ‘నేను ఇవ్వాళ కరోనా టెస్టు చేయించుకున్నా. దీంట్లో అసింప్టోమేటిక్ (లక్షణాలు లేని) కరోనా పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నా. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌లో వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నా. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని నాయక్ ట్వీట్ చేశారు.

గణేశ్ చతుర్థి పండుగ రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధ్యాత్మిక సీడీ, బుక్‌లెట్‌ను శ్రీపాద విడుదల చేశారు. రీసెంట్‌గా గోవాలో వరద బాధిత ప్రాంతాల్లో కూడా ఆయన పాల్గొన్నారని తెలిసింది. ఆయుశ్ మినిస్టర్‌‌ కూడా అయిన శ్రీపాద.. యోగా ప్రాక్టీషనర్స్‌కు కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువని గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

Latest Updates