టైమ్స్ 100 లిస్ట్‌‌లో బాలీవుడ్ యంగ్ హీరో

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా పేరు వినే ఉంటారు. డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను థ్రిల్‌‌కు గురి చేసే ఆయుష్మాన్ అంధాధున్ ఫిల్మ్‌‌తో జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. టైమ్ మేగజీన్ వరల్డ్ 100 మోస్ట్ ఇన్‌‌ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో ఆయుష్మాన్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో  ప్రధాని మోడీతోపాటు తాను కూడా ప్లేస్ దక్కించుకోవడం గౌరవంగా ఫీలవుతున్నానని చెప్పాడు.

‘టైమ్ నన్ను ఎంపిక చేయడం ఆనందాన్నిస్తోంది. ఒక ఆర్టిస్ట్‌‌గా నా సినిమాల ద్వారా సమాజంలో పాజిటివ్ ఛేంజ్ తీసుకురావడానికి యత్నిస్తున్నా. సమాజంలో, ప్రజల్లో మంచి మార్పు తీసుకొచ్చే శక్తి సినిమాలకు ఉందని నేనెప్పుడూ నమ్ముతా. అందుకే నేను ఎంచుకునే కంటెంట్‌‌ దేశ ప్రజల్లో మార్పు తీసుకొచ్చేలా సెలెక్ట్ చేసుకుంటా’ అని ఆయుష్మాన్ పేర్కొన్నాడు. ఆయుష్మాన్‌‌కు ఈ గౌరవం దక్కడంపై బాలీవుడ్ లాంగ్ లెగ్స్ బ్యూటీ దీపికా పడుకోన్ ఆనందం వ్యక్తం చేసింది. తన సినిమాల ద్వారా ఆయుష్మాన్ ప్రేక్షకుల్లో మరిచిపోలేని ముద్ర వేస్తున్నాడని ప్రశంసించింది. చాలెంజింగ్ క్యారెక్టర్స్‌‌లోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఆడియన్స్‌‌ను అలరిస్తున్నాడని మెచ్చుకుంది. ప్రతిభ, ఓపిక, కఠోర శ్రమ, భయపడకపోవడం లాంటి గుణాలతో ఆయుష్మాన్ ఈ స్థాయికి చేరుకున్నాడని వివరించింది.

Latest Updates