అయ్యప్ప దర్శనం 23 రోజుల తర్వాతే

ముగిసిన రెండు నెలల మకరవిళక్కు సీజన్‌‌‌‌‌‌‌‌

శబరిమల: రెండు నెలల మకరవిళక్కు పూజల తర్వాత శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు మూసేశారు. మంగళవారం తెల్లవారుజామున సంప్రదాయబద్దంగా పూజలు చేసిన ఆలయ పూజార్లు, అయ్యప్ప వంశస్తులు ఆలయాన్ని మూసేశారు. ఈ నెల 15న మకరవిళక్కు ఉత్సవం ముగిసినప్పటికీ భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచే ఉంచారు. సోమవారం సాయంత్రం వరకు భక్తులను దర్శనానికి అనుమతిచ్చామని, చివరి రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని దేవస్థానం బోర్డు చెప్పింది. సంప్రదాయాన్ని అనుసరించి తంత్రి మహేశ్‌‌‌‌‌‌‌‌ మోహనురు అభిషేకం, ఉషా నైవేద్యం తదితర పూజా కార్యక్రమాలు చేశారు.

ఆ తర్వాత అయ్యప్ప వంశస్తులు ప్రత్యేక పూజలు చేయగా అయ్యప్ప నామస్మరణం మధ్య ఆలయం తలుపులు మూసేశారు. నెలవారి పూజల కోసం ఫిబ్రవరి 13న వారం రోజుల పాటు ఆలయం తెరుచుకోనుంది. కేరళ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అయ్యప్ప ఆలయానికి వస్తారు.

RTA యాప్ : సెల్ఫీ అప్​లోడ్​తో బండి రిజిస్టర్​ 

Latest Updates