ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా అరెస్ట్

సమాజ్ వాదీ పార్టీ వివాదాస్పద ఎంపీ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజంఖాన్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్ పోర్టులో డేటాఫ్ బర్త్ వివరాలను తప్పుగా తెలిపినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి అబ్దుల్లాపై బీజేపీ నేత ఆకాశ్ సక్సేనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్ పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లలో పుట్టిన తేదీ వివరాలు వేర్వేరుగా ఉన్నాయని తన ఫిర్యాదులో ఆయన తెలిపారు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. సువార్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అబ్దుల్లా కొనసాగుతున్నారు.

Latest Updates