సుగంధ ద్రవ్యాల మార్కెట్లోకి అజిమ్‌ ప్రేమ్‌ జీ

న్యూఢిల్లీ: విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్ జీ త్వరలో సుగంధ ద్రవ్యాల మార్కెట్లోకి అడుగుపెట్టనున్నారు. పెర్ ఫ్యూమ్స్ లలో వాడే సుగంధాలను తయారు చేసే కంపెనీ బెస్ట్‌‌ వాల్యూ కెమ్‌ (బీవీసీ) లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు అజీమ్‌ ప్రేమ్‌ జీ కంపెనీ ఇన్వెస్ట్‌కు‌  సిద్ధమవుతోంది. ఈ కంపెనీ స్టేక్‌‌హోల్డర్ల నుంచి వాటాను కొనుగోలు చేయనుంది. డిమాండ్‌‌ను అందిపుచ్చుకునేందుకు కంపెనీ కెపాసిటీని విస్తరించాల్సి ఉందని బీవీసీ పేర్కొంది. క్యాపిటల్‌ను మెరుగుపరుచుకోవడానికి ఈ డీల్ ఉపయోగపడుతుందని పేర్కొంది. ఫ్లేవర్స్‌ అండ్‌‌ ఫ్రాగ్రెన్స్‌ ఇండస్ట్రీలోని ఫిర్మెనిక్‌‌, సిమ్‌ రైజ్‌ , టకసగో వంటి గ్లోబల్ కంపెనీలు బీవీసీ కస్టమర్లుగా ఉన్నారు.

Latest Updates