దేశంలో 50 లక్షల ఉద్యోగాలు హుష్‌

azim premji university report : 50 lakh men have lost their jobs
 • నోట్ల రద్దు తర్వాత రెం డేళ్లలో భారీగా పెరిగిన నిరుద్యోగం
 • అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ సర్వేలో వెల్లడి
 • పట్టణ ఉపాధి స్కీం పెట్టాలని సూచన
 • హెల్త్‌‌, ఎడ్యుకేషన్‌‌పై భారీగా ఖర్చు చేయాలని సిఫారసు
 • చదువులు పెద్దవి.. జాబులు చిన్నవి
 • పెద్ద డిగ్రీలున్నా డ్రైవర్లు , డెలివరీ బాయ్స్ కొలువులు
 • సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మరో సర్వే

అది 2016 నవంబర్‌ 8.. రాత్రి 10 గంటలు.. ఉరుము లేని పిడుగులా ప్రధాని మోడీ సంచలన నిర్ణయం ప్రకటిం చారు.. పెద్దనోట్ల రద్దు అంటూ బాంబు పేల్చారు.. అప్పట్నుంచి మొదలయ్యాయి జనం కష్టా లు! కరెన్సీ తిప్పలకు పేదల వెతలకు లెక్కేలేదు. బిజినెస్‌‌లు పడిపోయాయి. చిరు వ్యాపారులు చితికిపోయారు. ఎందరో ఉపాధి కోల్పోయారు. అలా అప్పట్నుంచి రెండేళ్ల టైంలో.. వందలు వేలు కాదు ఏకంగా 50 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయని బెంగళూరులోని అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ఎంప్లాయిమెం ట్‌ వెల్లడించింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా(ఎస్‌‌డబ్ల్యూఐ) 2019’ పేరుతో తాజాగా ఈ రిపోర్టును రిలీజ్‌ చేసింది.

న్యూఢిల్లీ: నోట్లు రద్దు చేసినప్పట్నుంచి రెండేళ్ల కాలంలో 50 లక్షల మంది కొలువులు పోయాయని, అయితే అది కేవలం కరెన్సీ రద్దు వల్లే కాదని, అప్పట్నుంచి ఈ ట్రెండ్‌ కొనసాగిందని ‘స్టేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ఇండియా-(ఎస్‌‌‌‌డబ్ల్యూఐ) 2019’ పేరుతో వెలువడిన రిపోర్టు తెలిపిం ది. జీఎస్టీ కూడా ఉద్యోగాలపై దెబ్బకొట్టిందని వివరించింది. జాబులు కోల్పోయినవారిలో కేవలం మగవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా మని,ఆడవారిని కూడా తీసుకుంటే ఈ సంఖ్య(50 లక్షలు) మరింత ఎక్కువుంటుందని పేర్కొంది. ‘‘ఉద్యోగాలు నోట్ల రద్దు వల్లే ఊడిపోయాయా కాదా అన్నది ముఖ్యం కాదు. 50 లక్షల మంది ఉపాధి కోల్పోవడం ఆందోళనకరం. విధానపరమైన నిర్ణయాలతో ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి 2011 నుంచే నిరుద్యోగం మెల్లగా పెరుగుతోంది.పెద్ద చదువులు చదివినవారు, అప్పుడే చదువులు పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్‌‌‌‌లో నిరుద్యోగం ఎక్కువగా కన్పిస్తోం ది. అంతంత చదువులు చదివినవారు, నిరక్షరాస్యుల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. నోట్లు రద్దు,జీఎస్టీ ఎఫెక్ట్‌‌‌‌ వీరిపైనే ఎక్కువ ప్రభావం చూపింది. దీనికి పల్లె, పట్నం తేడా లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది’’ అని నివేదిక వివరించింది. 2017–18మధ్య దేశంలో గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్టస్థాయికి నిరుద్యోగం పెరిగిపోయిందన్న చేదు వాస్తవాన్ని ఇటీవల లీకైన ప్రభుత్వ డాక్యుమెంట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. జూలై 2017 జూన్‌‌‌‌ 2018 మధ్య నేషనల్‌‌‌‌ శాంపిల్‌‌‌‌ సర్వే ఆఫీస్‌‌‌‌ చేసిన సర్వే లో దేశంలో నిరుద్యోగ రేటు 6.1గా నమోదైంది. 1972 నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ రిపోర్టును ప్రభుత్వం బయట పెట్టలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు ఈసమాచారాన్ని లీక్‌ చేశాయి.

మరేం చేయాలి?

నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఎస్‌‌‌‌డబ్ల్యూఐ కొన్నిసూచనలు కూడా చేసింది. అవేంటంటే..

 • గ్రామాల్లో ఉపాధి హామీ పథకం మాదిరే పట్టణ ఉపాధి హామీ స్కీం(యూఈజీపీ) తేవాలి.
 • దీని ద్వారా చిన్నచిన్న టౌన్లలో 5 కోట్ల మందికి ఉపాధి కల్పించాలి.
 • జీడీపీలో ఎడ్యుకేషన్‌‌‌‌ రంగంపై ఆరు శాతం,హెల్త్‌‌‌‌పై మూడు శాతం ఖర్చు పెట్టాలి.
 •  దీంతో 20 లక్షల జాబులు క్రియేట్‌‌‌‌ అవుతాయి.
 • ఇండియన్‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ రంగానికి మరింత ఊపు తెచ్చేందుకు కొత్త పారిశ్రామిక విధానం తేవాలి.

కూడు పెట్టని పెద్ద డిగ్రీలు

ఒకప్పుడు ఎంత పెద్ద చదువులు చదివితే అంత పెద్దజాబులు! ఇప్పుడు ఇది తిరగబడింది. రాత్రింబవళ్లుఎంతో కష్టపడి, లక్షలు ధారబోసి పెద్దపెద్ద డిగ్రీలు చదివిన వారంతా చిన్న చిన్న జాబులు చేస్తున్నారు.అటు ప్రభుత్వంలో, ఇటు ప్రైవేటులో చదువులకు తగ్గకొలువులు దొరక్కపోవడంతో టీ షాపు, పాన్ షాపు,డెలివరీ బాయ్స్, టాక్సీ డ్రైవర్లుగా సర్దుకుపోతున్నారు. ఉద్యోగం అనే చిన్న బోర్డు ఎక్కడ కనపడ్డా వెళ్లి రెజ్యూ మ్ తో క్యూలో నిలబడుతున్నారు. ఇంజనీరిం గ్,ఎంబీఏ, పీజీ, పీహెచ్‌ డీ వంటి పెద్ద చదువులు చదువుకున్నోళ్లకు పదేళ్ల కిందటిలా జాబ్‌‌‌‌లు దొరకడం లేదట. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ) చేసిన ‘కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌజ్ హోల్డ్ సర్వే ’లో ఈ విషయం వెల్లడైంది. 2016 నుంచి 2018 మధ్య 1 నుంచి 5వ తరగతి వరకు(ప్రైమరీ ఎడ్యుకేషన్‌‌‌‌) చదివిన వారిలో 3.8 కోట్ల మందికి జాబులు రాగా, 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుకున్న వారిలో 1.8 కోట్ల మందికి, పదో తరగతి,ఇంటర్ పూర్తి చేసిన వాళ్లలో 1.3 కోట్ల మందికి కొలువులు వచ్చాయి. గత మూడేళ్లుగా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ అంతకుమించి చదివిన వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని సీఎమ్ఐఈ సర్వే తెలిపింది. ఈ కేటగిరీలో 2016–-2018 మధ్యకేవలం 29 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే క్రియేట్అయ్యాయి.

ఎందుకిలా?

ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిటైల్ ఎంటర్ ప్రైజెస్ రంగాల్లో ప్యాకిం గ్, డెలివరీ అవసరాల కోసం తక్కువ స్కిల్‌‌‌‌ ఉన్నవారిని కంపెనీలు పెద్దఎత్తున రిక్రూట్‌ చేసుకుంటున్నాయి.దీంతో ఆ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. వాటంత వేగంగా స్కిల్‌‌‌‌ ఉన్నవాళ్లను(పెద్ద చదువులున్న వారిని) ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ మార్కె ట్లు రిక్రూట్‌ చేసుకోలేక పోవడంతో ఇటు వైపు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీం తో పెద్ద పట్టాలున్నాచేసేది లేక విద్యావంతులు చిన్నచి న్న జాబుల వైపు వస్తున్నట్టు సీఎమ్ఐఈ వెల్లడించింది.

సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ కు మొగ్గు

పెద్ద చదువులు చదివిన వారిలో ఎక్కువమంది సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌  బాట పడుతున్నారు. 2016-–18 మధ్య 2 కోట్ల మంది (గతంతో పోల్చితే 71 శాతం పెరుగుదల)ఇలా ఉపాధి పొందారని సీఎమ్ఐఈ వివరించింది. వీళ్లలో ఎక్కువ మంది జాబ్స్ సాధిం చలేకపోయిన వాళ్లు, సాధించినా ఎక్కువ కాలం నిలబెట్టు కోలేకపోయిన వాళ్లు ఉన్నారని తెలిపింది. మొత్తమ్మీద 2018 చివరి నాటికి దేశంలో 4.8 కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొం ది. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ లో భాగంగా వీధి బండ్లు, పాన్ షాపులు, ఇన్సూరె న్స్ ఏజెంట్స్, బ్రోకర్స్, ఫ్రీ లాన్స్ రైటర్స్, ట్యాక్సీ డ్రైవర్‌‌‌‌, ఫొటోగ్రాఫర్స్ వంటి వృత్తులను ఎంచుకుంటున్నట్టు వివరించింది.

Latest Updates