అనారోగ్యం కారణంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అనారోగ్య సమస్యల వల్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. అల్వాల్ లోని గణేష్ నగర్ కు చెందిన   సాయి కిరణ్  మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం  చదువుతున్నాడు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయి ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు  అతని నివాసానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడు అనారోగ్య సమస్యలతోనే చనిపోయాడా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. సాయి కిరణ్ స్వస్థలం నిజామాబాద్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates