ఏనుగుపై యోగా చేస్తూ పడిపోయిన బాబా రామ్ దేవ్

పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు, యోగాసనాలకు పెట్టింది పేరైన బాబా రామ్ దేవ్. ఎలాంటి ఆసనాలనైనా అవలీలగా వేయగలరు. అయితే నేల మీద కాకుండా కొత్తగా యోగాసనాలు చేస్తూ నేర్పించాలనుకున్నారు. దీంతో ఒక ఆశ్రమంలో ఏనుగు మీద యోగా చేస్తూ నేర్పిస్తున్నారు. అయితే అనుకోకుండా ఏనుగు పై నుంచి కిందపడిపోయారు రామ్ దేవ్. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాబా రాందేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్ లో యోగా నేర్పించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేని వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఆ భారీ ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.  ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబా పట్టించుకోకుండా యోగా భంగిమను కొనసాగించారు. మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే లేచి సర్దుకున్నరాందేవ్ అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Latest Updates