ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌‌షిప్ రేసులో పతంజలి

న్యూఢిల్లీ: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌‌షిప్ హక్కుల నుంచి చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అయిన స్పాన్సర్‌‌షిప్ స్లాట్‌ను దక్కించుకోవాలని పెద్ద కంపెనీలు యత్నిస్తున్నాయి. తాజాగా ఐపీఎల్‌ను బిడ్‌ను చేజిక్కించుకోవాలని యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ యత్నిస్తోందని తెలిసింది. ‘ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌‌షిప్‌ హక్కులను దక్కించుకోవాలని మేం భావిస్తున్నాం. మేం పతంజలికి గ్లోబల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌ ఇవ్వాలనుకుంటుంన్నాం’ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కే తిజరవాలా చెప్పారు. బడా కంపెనీలైన జియో, అమెజాన్, టాటా గ్రూప్, అదానీ లాంటివి కూడా ఐపీఎల్ స్పాన్సర్‌‌షిప్‌పై కన్నేశాయి. దీంతో బిడ్‌ భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పతంజలి లాంటి కంపెనీకి స్పాన్సర్‌‌షిప్ దక్కితే అది ఆ కంపెనీకే ఎక్కువగా లాభం చేకూర్చే చాన్సెస్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Updates