సినీనటులు ప్యాకేజీల కోసమే వైసీపీలోకి:రాజేంద్రప్రసాద్

వైఎస్సార్సీపీలో చేరిన సినీ నటులపై టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ విమర్శలు చేశారు. సినిమా అవకాశాలు లేని వారే వైఎస్సార్సీపీలో చేరుతున్నారని అన్నారు. జీవిత రాజశేఖర్ తిరగని పార్టీ లేదని..జగన్ కు కాల్షిట్లు అమ్ముకుని వైసీపీ తరపున ప్రచారం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. ప్యాకేజీల కోసం సినీ నటులు వైసీపీలో చేరుతున్నారని..వీరి వల్ల ఒక్క ఓటు కూడా పడదన్నారు.ఎన్నికల తర్వాత వీరిలో ఒక్కరు కూడా రాజకీయాల్లో కనిపించరని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన నేతలకు జగన్ మళ్లీ టికెట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

Latest Updates