ఆంటీ డోంట్ వర్రీ.. మీ కొడుకుపై కేసుపెట్టను: కేంద్ర మంత్రి

బెంగాల్:  కేంద్ర మంత్రి బబుల్ సుప్రియో పై కొందరు విద్యార్థులు శుక్రవారం దాడి చేశారు. అయితే ఆ  ఫొటో దేశం మొత్తం వైరల్ అయింది. ఈ ఘటనపై దాడిచేసిన విద్యార్థి తల్లి కేంద్రమంత్రి సుప్రియోకు తన కొడుకు  ‘ దేబంజన్‌ బల్లవ్‌’ ను రక్షించమని కోరింది. తన కొడుకు చేసిన తప్పుకు తాను చింతిస్తున్నానని తెలిపింది.  తాను సంవత్సరం నుంచి క్యాన్సర్ తో బాధ పడుతున్నానని ఆమె కేంద్రమంత్రికి చెప్పింది. దీంతో సుప్రియో ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఆంటీ మీ బాధను అర్థంచేసుకున్నాను. మీ కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదు బాధపడకండి. మీఆరోగ్యం జాగ్రత్త.. మీరు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని సుప్రియో రిప్లే ఇచ్చాడు.

బెంగాల్ లోని జాదవ్ పూర్ యునివర్సిటీలో శుక్రవారం ఏబీవీపీ నిర్వహించిన సభకు కేంద్రమంత్రి సుప్రియో అటెండ్ అయ్యారు. అయితే అతనికి వ్యతిరేకంగా వేరే గ్రూప్ కు చెందిన విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ ఆయన దగ్గరకు చేరారు. రక్షణ సిబ్బంది కంట్రోల్ చేసినా ఆగకపోవడంతో పాటు మంత్రి జుట్టుపట్టుకుని గుంజాడు దేబంజన్‌ బల్లవ్‌ అనే విద్యార్థి. ఈ రోజు ఆ స్టుడెంట్ తల్లి తన కొడుకును ఏమీ చేయవద్దంటూ సుప్రియోను కోరారు. దీంతో మంత్రి ఆ యువకుపై పోలీస్ కేసు పెట్టడంలేదని మాటిచ్చారు.

SFI విద్యార్థే సుప్రియో పై దాడిచేశాడు….
SFI విద్యార్థి విబాగానికి చెందిన విద్యార్థే తమ నాయకునిపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు బెంగాల్  బీజేపీ నాయకులు. ఈ చర్యకు నిరసనగా బారీగా ర్యాలీతీశారు. కేంద్ర మంత్రి బెంగాల్‌లో పర్యటిస్తే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదని. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని ఆరోపించారు.

https://twitter.com/ANI/status/1174976199476436993/photo/1

Latest Updates