కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తంగా బాబు అంతిమయాత్ర

కరీంనగర్ : బాబు అంతిమయాత్ర తీవ్ర ఉద్రిక్తతతో కొనసాగుతుంది. బస్టాండ్ వైపు తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కార్మికులకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట మధ్యన అంతిమయాత్ర కొనసాగుతుంది. బస్టాండ్ వైపు బాబు అంతిమయాత్రను తీసుకెళ్లేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

రోప్ పార్టీలు, బారికేడ్లు పెట్టి బాబు అంతిమయాత్రను స్మశానంవైపు దారి మళ్లించారు పోలీసులు. దీంతో కరీంనగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకులు అంతిమయాత్ర దగ్గరకు చేరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాబు అంతిమయాత్ర స్మశానానికి చేరేందుకు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

Latest Updates