బీరు తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి.. తెల్లారేసరికి..

బీరు తాగిన తల్లి పడుకునే ముందు బిడ్డకు పాలిచ్చింది. తెల్లారేసరికి ఆ నెలల బిడ్డ చనిపోయింది. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ లో 2013లో జరిగింది. ఆ కేసుకు సంబంధించి.. కోర్టు ఆ తల్లిని నిర్దోషిగా విడుదల చేసింది. మేరీల్యాండ్ కు చెందిన మోరిసన్ 2013లో ఓ రోజు బీరు తాగిన తర్వాత తన నెలల బిడ్డకు డైపర్ మార్చి, పాలిచ్చి పడుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ తెల్లారేసరికి బిడ్డ చనిపోయింది. బిడ్డ పట్ల మోరిసన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మేరీల్యాండ్ కోర్టు ఆమెకు 20 సంవత్సరాల శిక్ష విధించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై మోరిసన్ పైకోర్టులో అప్పీల్ చేసింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి.. బీరు తాగి పక్కన పడుకున్నంత మాత్రనా బిడ్డ చనిపోదని.. బిడ్డ చనిపోవడానికి, తల్లికి సంబంధంలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో కింది కోర్టు వేసిన 20 సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.

For More News..

ఐపీఎల్ ప్లేయర్లకు 4 సార్లు కరోనా టెస్టులు

లెక్కల్లో చూపని బంగారం ఉంటే ఫైన్ కట్టాల్సిందే!

Latest Updates