పెళ్లి చేసుకుందామన్న ఛార్మి..ఒకే చెప్పిన త్రిష

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిష, ఛార్మి మంచి ఫ్రెండ్స్. అయితే త్రిషది ఇవాళ ( మే 4న) 36వ పుట్టిన రోజు. చాలా మంది సెలబ్రేటీలు ఇవాళ త్రిషకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే  త్రిషకు ట్విట్టర్లో ఛార్మి కాస్త వెరైటీగా విషెస్ చెప్పింది. ‘బేబీ ఐ లవ్ యూ టుడే ఫర్ ఎవర్. నా ప్రపోజల్ ని ఎప్పుడు ఓకే అంటావా ? అని మోకాలిపై నిలబడి ఎదురు చూస్తున్నా. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పు డు ఇది చట్టబద్దమే‘. అంటూ సరదాగా ట్వీట్ చేసింది.  దీంతో పాటు త్రిష తనకు ముద్దు పెడుతున్న  ఫోటోను షేర్ చేసింది. ఛార్మి ప్రపోజల్ కు కూడా త్రిష రిప్లై ఇచ్చింది. నీ ప్రపోజల్ కే నేను ఎప్పుడో ఒకే చెప్పానని త్రిష చెప్పింది.

 

Latest Updates