డ్రైనేజీ గుంతలో పడ్డ చిన్నారి..రక్షించిన ఫైర్ సిబ్బంది

అబిడ్స్, వెలుగు: నాలుగేళ్ల చిన్నారి స్నేహితులతో ఆడుకుంటూ డ్రైనేజీ గుంతలో పడిపోయింది.వివరాల్లోకి వెళ్తే గౌలిగూడలో నివాసముంటున్నచంద్రకాంత్, లత కూతురు దివ్య(4). శనివారం కురిసిన వర్షానికి రోడ్డు జలమయం కావడంతో నాలాపై ఉన్నరాయి కొట్టుకు పోయింది.ఆదివారం నాలా పక్కనే ఆడుకుంటున్న చిన్నారి డ్రైనేజీ గుంతలో పడిపోయింది. ఇది గమనించిన చిన్నారి స్నేహితులు కేకలు వేశారు. ఈ సంఘటన జరిగిం ది గౌలిగూడలోని ఫైర్ స్టేషన్ సమీపంలో కావడంతో ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఫైర్ మ్యాన్ వి.క్రాంతి కుమార్,సురేష్ , హోమ్ గార్డ్ రమణ, డ్రైవర్ వసంత్ కుమార్ లు ఘటనా స్థలానికి చేరుకున్నా రు.వారి వద్ద ఉన్న నిచ్చెనే , తాడు సహాయంతో డ్రైనేజీ గుం తలోకి దిగారు. 12 అడుగుల లోతుఉన్న డ్రైనేజీ గుంతలో నుంచి చిన్నారిని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. చిన్నారిగుం తలో పడిన10 నిమిషాల వ్యవధిలోనే బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిం ది. అగ్నిమాపక  సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు. అనంతరం చిన్నారిని వారిఫైర్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయిం చి తల్లిదండ్రులకు అప్పగించారు .

 

Latest Updates