దుమ్ము రేపుతున్న బాచుపల్లి రోడ్డు

బాచుపల్లి, వెలుగు: బాచుపల్లి రోడ్లపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు రోడ్లపై కంకర తేలి, గుంతలు ఏర్పడి, దుమ్ము ఎగిసిపడుతోంది . బాచుపల్లి చౌరస్తా నుంచి ఐడీఎల్ బొల్లారం వైపు రోడ్లన్నీ గుంతలు పడి,కంకర తేలి అస్తవ్యస్తంగా మారాయి. భారీ వాహనాలు వెళ్తుంటే వెనుక వచ్చే ద్వి చక్ర వాహనదారుల కళ్లల్లో దుమ్ము పడుతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

Bachupalli Chaurasta to IDL Bolaram roads are potholes and gravel

Latest Updates