డిప్యూటీ కలెక్టర్ గా బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్

షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనను టూరిజం అథారిటీలో డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాంత్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకోవడంతో పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా.. ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించి శిక్షణ పొందేందుకు కూడా ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శ్రీకాంత్ పదవీ బాధ్యతల గురించి ఏపీ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీకాంత్ 2017లో ఇండోనేషియా ఓపెన్ సిరీస్ గెలవడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాంత్ కు గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటించారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ పూర్తవడంతో శ్రీకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

For More News..

టాయిలెట్ ను క్వారంటైన్ గా మార్చుకున్న యువకుడు

కరోనావైరస్ ను చంపే ఛార్జింగ్ మాస్క్

Latest Updates