బాహుబలి పీఎం కరోనాను కట్టడి చేయలేకపోయారు

బాహుబలి పీఎం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరం పాలన పూర్తి చేసుకోవడంపై కపిల్ సిబల్ స్పందించారు.

చైనా, నేపాల్ సరిహద్దు వివాదంపై ప్రధాని మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాహుబలి ప్రధాని కరోనా ను ఎదుర్కోలేక..దేశాన్ని కష్టాల్లోకి నెట్టారని చెప్పారు.  కేంద్రప్రభుత్వం వైరస్ ను మహమ్మారిగా ప్రచారం చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.  పీఎం కేర్స్ ఫండ్ వివరాల్ని బహిర్ఘతం చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే వలస కూలీలు తమ గమ్య స్థానాలకు చేరేందుకు ఆకలితో అలమటిస్తూ, నడుచుకుంటూ వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారని సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ ముందుకు లాక్ డౌన్ తరువాత కేంద్రం కరోనా కేసుల్ని ధృవీకరించడమే పనిగా పెట్టుకుందన్న ఆయన… వలసకూలీలు తమ సొంత రాష్ట్రాలకు  రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం ప్రభుత్వం  ఉదాసీనతకు నిదర్శనం, ఎందుకంటే చాలా మంది ఆకలి కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నారు.

ప్రధాని సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోయారని ఆరోపించిన సిబల్..కరోనా సంక్షోభంలో మరణించిన కార్మికులకు ఎంత ఎక్స్ గ్రేషియా ఇచ్చారో చెప్పాలని అన్నారు.

Latest Updates