ఖేల్ రత్నకు శ్రీకాంత్ పేరు నామినేట్

  • అపాలజీ చెప్పిన తర్వాత రికమెండ్‌ చేసిన బాయ్‌
  •  ప్రణయ్‌కు షోకాజ్‌ నోటీస్

ఇండియాస్టార్‌‌ షట్లర్, తెలుగు ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌‌ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌‌ గాంధీ ఖేల్‌‌రత్న బరిలో నిలిచాడు. ఫిబ్రవరి లో జరిగిన ఏషియన్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ సెమీఫై నల్లో ఆడనుందుకు శ్రీకాంత్‌‌ క్షమాపణ కోరడంతో బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఆప్‌ ఇండియా(బాయ్‌‌) శుక్రవారం అతని పేరును ఖేల్‌‌రత్నకు నామినేట్‌‌ చేసింది. అలాగే, అర్జున అవార్డుకు సిఫారసు చేయనందుకు తమపై తీవ్ర ఆరోపణలు చేసిన సీనియర్‌‌ ప్లేయర్‌‌ హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌కు షోకాజ్‌‌ నోటీసులు జారీ చేసింది. స్పోర్ట్స్‌‌ అవార్డుల కోసం బాయ్‌‌ ఇప్ప టికే స్పోర్ట్స్‌‌ మినిస్ట్రీకి లిస్ట్‌‌ పంపించింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగాశ్రీకాంత్‌‌,హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌లను పరిగణనలోకి తీసుకోలేదు.ఈ ఇద్దరూ ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ సెమీస్‌‌లో ఆడకుండా మరో కాంపిటీషన్‌‌ కోసం బార్సిలోనా వెళ్లారు. దాంతో, సెమీస్‌‌లో ఓడిన ఇండియా మూడో ప్లేస్‌ తో సరిపెట్టుకుంది. చేసిన తప్పుకు కిడాంబి సారీ చెప్పడంతో వివాదం ముగిసింది. కానీ, అసోసియేషన్‌‌పై చేసిన విమర్శలకు 15 రోజుల్లోగా సమాధానం చెప్పా లని ప్రణయ్‌‌కు జారీ చేసిన షోకాజ్‌‌ నోటీ సుల్లో బాయ్‌‌ స్పష్టం చేసింది. ‘శ్రీకాంత్‌‌, ప్రణయ్‌‌ వద్దన్నా వినకుండా ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ టీమ్‌‌ను విడిచి వెళ్లారు. దాంతో ఆ టోర్నీలో హిస్టారికల్‌‌ మెడల్‌‌ నెగ్గే ఇండియా చాన్సెస్‌‌ దెబ్బతిన్నాయి . అయితే, తన తప్పును అంగీకరిస్తూ శ్రీకాంత్‌‌ మాకు ఈమెయిల్‌‌ చేశాడు. ఫ్యూచర్‌‌లో మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయనని ప్రామిస్‌‌ చేశాడు. శ్రీకాంత్‌‌ టాలెంట్‌‌, అతను సాధించిన ఘనతలను దృష్టిలోష్టి ఉంచుకొని ఖేల్‌‌రత్నకు అతని పేరు రికమెండ్‌‌ చేశాం. మరోవైపు ప్రణయ్‌‌ క్రమశిక్షణ తప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయినా ఫెడరేషన్‌‌ చాలా సహనం వహిస్తూ వచ్చింది. కానీ, ఈ మధ్యకాలంలో అతని వైఖరి శృతి మించింది. నిర్ణీత గడువులోగా షోకాజ్‌‌ నోటీసుకు సమాధానం ఇవ్వక పోతే బాయ్‌‌ అతనిపై కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని బాయ్‌‌ జనరల్‌‌ సెక్రటరీ అజయ్‌‌ సింఘానియా పేర్కొన్నా రు. ప్లేయర్లు, కోచ్‌‌లు, టెక్నికల్‌‌ అఫీషియల్స్‌‌ కోసం కఠినమైన ‘కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్’‌ను బాయ్‌‌ రూపొందిస్తోంది.

Latest Updates