అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై వాదనలు

మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు. రిమాండ్ అనంతరం అఖిలప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు. గురువారం బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిలప్రియను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ అఖిలప్రియ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. A1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణ అనంతరం 41 సీఆర్పీ నోటీసు ఇచ్చి వదిలేశారు. కానీ A2గా ఉన్న అఖిలప్రియను మాత్రం అరెస్ట్ చేశారని కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. అంతేకాకుండా కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మాత్రం ఇంకా పరారీలోనే ఉండటం గమనార్హం. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హఫీజ్‌పేట్‌లోని భూ వివాదమే ఈ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు తేల్చారు.

For More News..

పరిహారం కోసం నాలుగేండ్లుగా ఆఫీసుల చుట్టూ..

సంక్రాంతికి 146 స్పెషల్‌‌‌‌ ట్రైన్స్.. 30% అదనపు ఛార్జీలు

గర్భిణీ ఉద్యోగులకు వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌

Latest Updates