సొంత బిజినెస్సే లైఫ్ గోల్ అంటున్నారు

బజాజ్‌‌ అలయన్జ్‌‌ సర్వే వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు : ఇండియాలో ఎక్కువ మంది ఎంట్రప్రెనూర్లు, హెల్త్‌‌–ఫిట్‌‌నెస్‌‌, ట్రావెల్‌‌తోపాటు సమాజానికి తిరిగి ఇవ్వడం వంటి వాటిని లైఫ్‌‌ గోల్స్‌‌గా పెట్టుకుంటున్నారు. 22–55 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తుల మీద బజాజ్‌‌ అలయన్జ్‌‌ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.  ఎంపిక చేసిన 130 లైఫ్‌‌ గోల్స్‌‌తో దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాలలోని 1681 మందిపై ఈ సర్వేను నిర్వహించారు.  రిటైర్మెంట్‌‌ సంబంధ గోల్స్‌‌ ప్రాధాన్యంగా మారాయని, ముఖ్యంగా మిలినియల్స్‌‌లో ఇది అధికంగా కనిపిస్తోందని సర్వేలో తేలినట్లు బజాజ్‌‌ అలయన్జ్‌‌ సీఈఓ తరుణ్‌‌ ఛుగ్‌‌ వెల్లడించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే లైఫ్‌‌ గోల్స్‌‌ పట్ల దక్షిణాది ప్రజలలోనే ఎక్కువగా అవగాహన ఉన్నట్లు సర్వేలో తేలిందని చెప్పారు. రిటైర్మెంట్‌‌, పిల్లల భవిష్యత్తు వంటి సాధారణమైన లైఫ్‌‌ గోల్స్‌‌ను పెద్దలు లేదా మెంటార్ల ప్రభావంతో తీసుకుంటుండగా, అసాధారణమైన ట్రావెల్‌‌, ఎంట్రప్రెనూర్షిప్‌‌, ఛారిటీ వంటి లైఫ్‌‌ గోల్స్‌‌ను సోషల్‌‌ మీడియా ప్రభావంతో తీసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైందని ఛుగ్‌‌ తెలిపారు. లైఫ్‌‌ గోల్స్‌‌ను లోతుగా అధ్యయనం చేయడం ఇండియాలో ఇదే మొదటిసారని, తమ సర్వే ఇతర కంపెనీలకూ దోహదపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ట్రావెల్‌‌ పట్ల మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.

Latest Updates