బజాజ్ ఫైనాన్స్‌‌కు బంపర్ లాభం

క్యూ2 లాభాల్లో 63 శాతం జంప్

న్యూఢిల్లీ: బజాజ్ ఫైనాన్స్ స్ట్రీట్ అంచనాలను బీట్ చేసింది. మంగళవారం వెల్లడించిన 2019–20 ఆర్థిక సంవత్సరపు క్యూ2 ఫలితాల్లో బజాజ్ ఫైనాన్స్‌‌ నికర లాభం 63.11  శాతం పెరిగి రూ.1,506 కోట్లుగా నమోదైంది.  లాభం భారీ ఎత్తున పెరగడంతో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఇంట్రాడేలో పరుగులు పెట్టి సరికొత్త గరిష్ట స్థాయి రూ.4,219.5 మార్క్‌‌ను తాకాయి.  ఆ తర్వాత షేర్‌‌ కొంత బలహీనపడింది. చివరకు 2 శాతం నష్టంతో రూ. 4,050 వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో రూ.923 కోట్ల నికర లాభం ఆర్జించినట్టు బజాజ్ ఫైనాన్స్ బీఎస్‌‌ఈ ఫైలింగ్‌‌లో పేర్కొంది. బజాజ్ గ్రూప్లోని ఈ  సంస్థ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం 48 శాతం పెరిగి రూ.6,322 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో ఈ ఆదాయం రూ.4,273 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. నికర వడ్డీ ఆదాయం ఈ రెండో క్వార్టర్‌‌‌‌లో 48 శాతం జంప్ చేసి రూ.3,999 కోట్లకు పెరిగింది. ఇతర ఆదాయమూ రూ.860 కోట్లుగా నమోదైంది. ఇది కూడా సంబంధిత క్వార్టర్‌‌‌‌లో 80 శాతం పెరుగుదలను రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో ఇతర ఆదాయం ద్వారా బజాజ్ ఫైనాన్స్ రూ.478 కోట్లను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌‌‌‌లో స్థూల ఎన్‌‌పీఏలు, నికర ఎన్‌‌పీఏలు స్థిరంగా1.61 శాతం,0.65 శాతం వద్ద ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ కొత్త కస్టమర్‌‌‌‌ అక్విజిషన్‌‌ ఈ క్వార్టర్లో కూడా చాలా బలంగా ఉంది. కొత్తగా19.2  లక్షల మంది కస్టమర్లను సంపాదించుకుంది. 2019 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం కస్టమర్ల సంఖ్య 3.87 కోట్లకు చేరింది. ఇయర్ ఆన్‌‌ ఇయర్‌‌‌‌ కస్టమర్ గ్రోత్ 29 శాతంగా ఉంది. లిక్విడిటీ విషయంలో తాము చాలా కంఫర్డబుల్‌‌ ప్లేస్‌‌లో ఉన్నామని కంపెనీ చెప్పింది.

బజాజ్ ఫైనాన్స్  హైలెట్స్..

కన్సాలిడేటెడ్ అసెట్స్ అండర్‌‌‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ 38 శాతం పెరిగి రూ.1,35,533 కోట్లుగా రికార్డు

కొత్త రుణాల సంఖ్య 23 శాతం పెరిగి 64.7 లక్షలుగా నమోదు

రుణ నష్టాలు, ప్రొవిజన్లు ఈ క్వార్టర్‌‌‌‌లో రూ.594 కోట్లు

Bajaj Finance Q2 profit rises 63% YoY to Rs 1,506 crore, beats Street estimates

 

Latest Updates