తగ్గిన బజాజ్ ఫిన్‌సర్వ్ లాభం

77 % పడిపోయిన లాభాలు

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  బజాజ్‌‌‌‌ ఫిన్​సర్వ్‌‌‌‌‌‌‌‌ కన్సాలిడేటెడ్‌‌‌‌ నికర లాభం 77 శాతం తగ్గి రూ. 194.4 కోట్లుగా నమోదైంది. ఈ లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4 లో రూ. 838.7 కోట్లుగా ఉంది. కరోనా దెబ్బతో కంపెనీ కాంటిజెన్సీ ప్రొవిజన్‌‌‌‌లు పెరిగాయి. దీంతో కంపెనీ నికర లాభం భారీగా తగ్గింది. బజాజ్‌‌‌‌ ఫిన్​సర్వ్‌‌‌‌‌‌‌‌ కన్సాలిడేటెడ్‌‌‌‌ ఆదాయం క్యూ4లో 2.3 శాతం పెరిగి రూ. 13,294 కోట్లకు చేరుకుంది. ఈ ఆదాయం గత 2018–19 క్యూ 4లో రూ. 12, 995 కోట్లుగా నమోదైంది.  మొత్తంగా 2019–2020 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే బజాజ్‌‌‌‌ ఫిన్​సర్వ్‌‌‌‌‌‌‌‌ నికర లాభం 4.7 శాతం పెరిగి రూ. 3,369.13 కోట్లుగా నమోదైంది. 2018–19 లో ఈ లాభం రూ. 3,219 కోట్లుగా ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 42,606 కోట్లుగా నమోదైన కంపెనీ రెవెన్యూ, 2019–20 లో 27.6 శాతం వృద్ధి చెంది రూ. 54,346.69 కోట్లకు చేరుకుంది. గురువారం సెషన్‌‌‌‌లో కంపెనీ షేరు విలువ 3.60 శాతం పడిపోయి రూ. 4,532.60 వద్ద ముగిసింది.

Latest Updates