బజరంగ్ దళ్ హల్చల్ : కలిసి ఉన్నారని తాళి కట్టించారు

బజరంగ్ దళ్ కార్యకర్తల వాలెంటైన్స్ డే వ్యతిరేక ర్యాలీలు

హైదరాబాద్ లో 30 బృందాలు

రోడ్లపై బైక్ ర్యాలీలు.. పార్కులు, పబ్ లు, రెస్టారెంట్లపై దృష్టి

వాలెంటైన్స్ డే విదేశీ సంస్కృతి అనీ… దానికి దేశంలోని యువత దూరంగా ఉండాలని కోరుతూ బజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాద్ సహా ప్రముఖ నగరాల్లో ప్రత్యేకంగా ర్యాలీలు చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఏ ప్రేమ జంట అయినా రోడ్లపై, పార్కుల్లో కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని ముందుగానే హెచ్చరించింది బజరంగ్ దళ్. మేడ్చల్ లో తమకు ఎదురుపడిన ఓ ప్రేమ జంటకి పెళ్లి చేశారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. CMR కాలేజ్ ఎదురుగా ఉన్న పార్క్ లో ప్రేమ జంటకు బలవంతంగా పెళ్లి చేశారు. అబ్బాయితో అమ్మాయి మెడలో తాళి కట్టించారు.

హైదరాబాద్ లో 30 బజరంగ్ , వీహెచ్పీ బృందాలు వాలెంటైన్ వ్యతిరేక ర్యాలీలు చేస్తున్నాయి. బైక్ ర్యాలీలతో … ప్రేమికుల దినోత్సవం విదేశీ సంస్కృతి అంటూ ప్రచారం చేస్తున్నారు. వాలెంటైన్స్ డేను జరుపుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పార్కుల్లో కనిపిస్తే ప్రేమ జంటలకు పెళ్లి చేస్తామని చెప్పారు. రెస్టారెంట్లు, పబ్బుల్లో వాలెంటైన్స్ డే స్పెషల్ ఈవెంట్లు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు.

ఈ సంఘటనపై మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగకూడదని.. వీడియోలో ఉన్న బజరంగ్ దళ్ కార్యకర్తల పై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

Latest Updates