లవర్స్ డేకు వ్యతిరేరంగా ర్యాలీలు..భజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన 60 మంది భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. LB నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని హనుమాన్‌ టెంపుల్‌ నుంచి LB నగర్‌ రింగ్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమికుల దినోత్సవం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

పంజాగుట్టలోని బంగారం దుకాణాల వద్ద కూడా భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బంగారం కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించి.. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. బంగారం షాపుల వద్ద ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులు కాషాయ జెండాలను చేతబూని.. జైశ్రీరాం నినాదాలు చేశారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ABVP కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వాలైంటెన్స్‌ డే వేడుకలు నిర్వహిస్తున్న ఓ ప్రయివేటు హోటల్‌ దగ్గర వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

Latest Updates