ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌: బజ్‌ రంగ్‌ కు గోల్డ్‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా రెజ్లింగ్‌ బాహుబలి బజ్‌ రంగ్‌ పునియా మరోసారి భళా అనిపించాడు. తన ఉడుంపట్టుతో ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్‌ లోదేశ పతాకాన్ని రెపరెపలాడించాడు. నంబర్‌ వన్​ ర్యాంక్‌ తో మెగా టోర్నీలో బరిలోకి దిగిన బజ్‌ రంగ్‌ .. అంచనాలను అందుకుంటూ గోల్డ్‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టు కొచ్చాడు. ప్రవీణ్‌ రాణారజత కాంతులు విరజిమ్మగా…సత్యవర్త్‌ కడియన్‌ కంచు మోత మోగించాడు.

 

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్​ను ఇండియా ఘనంగా ఆరంభించింది. టోర్నీ తొలి రోజే ఇండియా ఖాతాలో మూడు పతకాలు చేరాయి. వరల్డ్‌ నంబర్‌ వన్ బజ్‌ రంగ్‌ పునియా పురుషుల ఫ్రీ స్టయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 65కేజీల విభాగంలో బంగారు పతకం సాధించగా, ప్రవీణ్‌ రాణా(79 కేజీలు) సిల్వర్‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సత్యవర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (97కేజీ) కాంస్య పతకం గెలిచారు. మంగళవారం జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌట్‌ లో బజ్‌ రంగ్‌ 12–7తో సయత్‌ బెక్‌ఒకాసోవ్‌ (కజకిస్తాన్‌ )ను ఓడించి బంగారు పతకం గెలిచాడు. తుదిపోరులో బజ్‌ రంగ్‌ ఓదశలో 2–5 తో వెనకబడ్డాడు. మరో నిమిషంలో బౌట్‌ ముగుస్తుందనగా.. ఒక్కసారిగా పుంజుకున్న పునియా. ఒకాసోవ్‌ పై లెగ్‌ అటాక్‌ చేసిరెండు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత అదేఊపులో మరో ఎనిమిది పాయింట్ లు సాధించి12–7తో తిరుగులేని విజయం సాధించాడు.

ఈమెగా టోర్నీలో బజ్‌ రంగ్‌ కు ఇది రెండో బంగారు పతకం కాగా, ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐదో పతకం కావడంవిశేషం. అంతకముందు సెమీస్‌ బౌట్‌ లో బజరంగ్‌ 12–1తో సిరోజిద్దిన్‌ ఖాస్నో వా(ఉజ్బెకిస్తాన్‌ )పై సునాయాస విజయం సాధించాడు. టోర్నీలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన పునియా.. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే క్రమంలో అతను ఒకే ఒక్క పాయింట్‌ ను కోల్పోవడం గమనార్హం. తాజా పెర్ ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ప్రత్యర్థులకు బజ్‌ రంగ్‌ హెచ్చరికలు పంపించాడు.

 

పురుషుల79 కేజీల విభాగంలో ప్రవీణ్‌ రాణా స్వర్ణం చేజార్చుకున్నాడు. అయినా ఏడేళ్ల విరామం తర్వాత మేజర్‌ టోర్నీలో పతకం గెలిచాడు. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణా 0–3తో ఇరాన్‌ కు చెందిన మహ్మద్‌ తెమోరి చేతిలో ఓడిపోయి సిల్వర్‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. సెమీస్‌ లో ప్రవీణ్‌ 3–2తో గేల్మజన్‌ ఉస్సెర్‌ బయెవ్‌ (కజకిస్తాన్‌ )పై గెలిచి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరాడు. ఇక 97 కిలోల కాంస్య పతక పోరులో సత్యవర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కడియన్‌ 8–1తో హవొబిన్‌ గవొ (చైనా)పై విజయం సాధించాడు. అంతకు ముందు క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఓడిపోయిన కడియన్‌ .. తన ప్రత్యర్థి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరడంతో రెపిఛేజ్‌ లో కాంస్య పతక బౌట్‌ కు అర్హత సాధించాడు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాడు. 57 కేజీల విభాగంలో రెపిఛేజ్ ద్వారా కాంస్యం పతక పోరుకు అర్హత సాధించిన రవికుమార్‌ 0–4తో చియ సొలు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయి నిరాశ పరిచాడు. 70 కేజీల విభాగంలో రజనీశ్‌ తొలి రౌండ్‌ లోనే పరాజయం పాలయ్యాడు.

 

 

Latest Updates