మోడీపై తీవ్ర విమర్శలు చేసిన బాలకృష్ణ

అనంతపురం:  ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. తాను తిట్టే తిట్లకు మోడీ సముద్రంలో దూకి చావాలంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన బాలకృష్ణ కాసేపు సినిమా డైలాగులు చెబుతూ..డప్పుతో దరువేస్తూ.. డ్యాన్స్ చేస్తూ  అక్కడున్న వారిని ఉత్సాహ పరిచారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ ‘ మోడీని గతంలో చాలా సార్లు తిట్టాను. అయినా సిగ్గు, శరం లేదు. మోడీ నిజంగా మగాడైతే.. నేను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చావాలి. మోడీ.. కేసీఆర్, జగన్ లతో కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. వారు ముగ్గురు కలిసినా నన్నేమి చేయలేరు. కరువుతో అల్లాడుతున్న అనంతపురంను పచ్చని పొలాలు ఉండేటట్లు తీర్చిదిద్దింది చంద్రబాబే ‘ అని అన్నారు. బాలకృష్ణ పలుసార్లు నోరు జారి విమర్శల పాలయ్యారు.

Latest Updates