మారని బాలకృష్ణ.. టీడీపీ కార్యకర్తపైనే జులుం

టీడీపీ లీడర్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత పార్టీ కార్యకర్త పై విరుచుకుపడ్డారు. దీంతో కలత చెందిన అతను.. పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ప్రచారంలో బిజీ అయ్యారు బాలకృష్ణ. ఇందులో బాగంగా.. ఈ రోజు ఉదయం హిందూపూర్ లోని సిరిపురంలో ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ ప్రసంగించారు. దీంతో తమ ఊరికి నీటిని విడుదల చేయాలని బాలకృష్ణను టీడీపీ కార్యకర్త రవికుమార్ కోరారు. దీంతో కోపానికి వచ్చిన బాలకృష్ణ రవికుమార్ ను బయటకు పంపాలని పోలీసులకు చెప్పాడు. దీంతో  రవికుమార్ ను బయటకు నెట్టేశారు పోలీసులు. ఊహించని పరిస్థితులు ఎదురుకావడంతో.. రవికుమార్ కొద్ది సేపటివరకు షాక్ కు గురయ్యాడు. తానేం పార్టీకి వ్యతిరేకిని కానని మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనతో మనస్థాపం చెందానని చెప్పి టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడు.

తరచూ తన అభిమానులపై విరుచుకుపడే బాలకృష్ణ రెండురోజుల క్రితం ఓ వీడియో జర్నలిస్ట్ ను నరికి పోగులు పెడతానంటూ హెచ్చరించాడు. మా జీవితాలు మీపై ఆదారపడతాయిరా.. అంటూ ఊగిపోయారు.. ఆ తర్వత తాను మీడియాకు వ్యతిరేకం కానని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు బాలకృష్ణ.

Latest Updates