రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డు

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ లోని బాలాపూర్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. రూ. 17.60 లక్షలకు కొలన్ రాంరెడ్డి దక్కించుకున్నారు. ఈ లడ్డూ బరువు 21 కిలోలు.  ఈ సారి లడ్డూ వేలం పాటలో 19 మంది పోటీపడ్డారు.  2018లో  రూ.16.60 లక్షలకు బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ సారి లడ్డూ ధర రూ. లక్ష రూపాయలు ఎక్కువగా పలికింది.1994 లో మొదటి సారిగా లడ్డూ రూ. 450 పలికింది. అప్పటి నుంచి  లడ్డూ ధర పెరుగుతూనే ఉంది.

Latest Updates