గుర్తింపునకు నోచుకోని బల్బీర్ సింగ్ ఘనతలు

న్యూఢిల్లీ:  ఇండియా క్రీడారంగంలో ఆణిముత్యం లాంటి ఆటగాడైన దివంగత బల్బీర్ సింగ్‌‌ సీనియర్‌‌కు తగిన గుర్తింపు లభించలేదని పలువురు హాకీ ప్లేయర్లు అంటున్నారు. అనారోగ్య కారణాలతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన బల్బీర్‌‌.. కడదాకా హాకీ అభివృద్ధి కోసం కృషి చేశాడు. త్రీ టైమ్‌‌ ఒలింపిక్‌‌ గోల్డ్‌‌ విన్నర్‌‌గా, కెప్టెన్‌‌గా, కోచ్‌‌గా, మేనేజర్‌‌గా ఇండియన్‌‌ హాకీపై  బల్బీర్ చెరగని ముద్ర వేశాడు. ఫాదర్‌‌ ఆఫ్‌‌ ఇండియన్‌‌ హాకీగా గుర్తింపు పొందిన  మేజర్‌‌ ధ్యాన్‌‌చంద్‌‌ స్వాతంత్రానికి పూర్వం మన హాకీకి పటిష్ట పునాది వేస్తే.. ఇండిపెండెన్స్‌‌ తర్వాత సింగ్‌‌ దాన్ని కొత్త శిఖరాలకు చేర్చాడు. అయితే,  ధ్యాన్‌‌చంద్‌‌ మాదిరిగా  బల్బీర్‌‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదు. బల్బీర్‌‌కు దేశ హైయ్యెస్ట్‌‌ సివిలియన్ అవార్డు భారతరత్న ఇవ్వాలని పంజాబ్‌‌ సీఎం అమరిందర్‌‌  కేంద్రానికి లేఖ  రాశారు. అందుకు బల్బీర్‌‌ అర్హుడు కూడా. కానీ,  ధ్యాన్‌‌చంద్‌‌కే భారతరత్న ఇవ్వని  ప్రభుత్వాలు..  బల్బీర్‌‌ను గౌరవించడంలో  పూర్తిగా విఫలమయ్యాయి.  కానీ, ధ్యాన్‌‌చంద్‌‌ పుట్టిన రోజును (ఆగస్టు 29) నేషనల్‌‌ స్పోర్ట్స్‌‌ డేగా ప్రకటించి.. క్రీడా పురస్కారాలు అందజేస్తున్నారు. అలాగే, స్పోర్ట్స్‌‌లో హైయ్యెస్ట్‌‌  లైఫ్‌‌ టైమ్‌‌  అవార్డుగా  ధ్యాన్‌‌చంద్‌‌ పురస్కారం ఇస్తున్నారు. ధ్యాన్‌‌చంద్‌‌ గౌరవార్థం ఢిల్లీ నేషనల్‌‌ స్టేడియానికి 2002లో ఆయన పేరు పెట్టారు. కానీ, బల్బీర్‌‌ సింగ్‌‌ను మాత్రం ప్రభుత్వం సముచితంగా గౌరవించకపోవడం శోచనీయం. 1957లో కేవలం పద్మశ్రీ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. దాంతొ మరణానంతరం అయినా బల్బీర్‌‌ను ప్రభుత్వం సరైన విధంగా గౌరవించాల్సిన అవసరం ఉందని  ఇండియా హాకీ మాజీ కెప్టెన్లు

అజిత్‌‌ పాల్‌‌ సింగ్‌‌, దిలీప్‌‌ టర్కీ, ధ్యాన్​చంద్​ కొడుకు అశోక్‌‌ కుమార్‌‌  డిమాండ్‌‌ చేస్తున్నారు. ఇండియా క్రీడారంగానికి బల్బీర్‌‌ చేసిన సేవలకు గుర్తింపుగా వెంటనే  నేషనల్‌‌ హానర్‌‌ ప్రకటించాలని అంటున్నారు. ‘ధ్యాన్‌‌చంద్‌‌, బల్బీర్‌‌ ఇద్దరూ ఇండియన్‌‌ స్పోర్ట్స్‌‌లో లెజెండ్స్‌‌. రికార్డుల పరంగా ఇద్దరూ సమాన ఘనతలు సాధించారు. ధ్యాన్‌‌చంద్‌‌ ఇండియన్‌‌ హాకీకి ఫాదర్  అయితే బల్బీర్‌‌ అంకుల్‌‌ అవుతాడు. ధ్యాన్‌‌చంద్‌‌ పుట్టిన రోజును నేషనల్‌‌ స్పోర్ట్స్‌‌ డేగా జరుపుకోవడం, నేషనల్‌‌ స్టేడియానికి ఆయన పేరు పెట్టడంతో పాటు ధ్యాన్‌‌చంద్ లైఫ్‌‌ టైమ్‌‌ అవార్డు ఇవ్వడం ద్వారా ఆయనకు ఎంతో కొంత గౌరవం ఇచ్చాం. కానీ, దిలీప్ టర్కీ

బల్బీర్‌‌ సింగ్‌‌ అర్హతకు తగిన గుర్తింపు, గౌరవం మాత్రం లభించలేదు. ఆయనకు దక్కింది కేవలం పద్మశ్రీనే. కానీ, నేనైతే ఇద్దరూ భారతరత్నకు అర్హులు అంటా. వాళ్లు మన దేశ హీరోలు. ఎన్నో జనరేషన్లను ఇన్‌‌స్పైర్‌‌ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి భారతరత్న ఎందుకు ఇవ్వరు?’ అని  1975 వరల్డ్‌‌కప్‌‌ విన్నింగ్‌‌ టీమ్‌‌ కెప్టెన్‌‌ అజిత్‌‌ పాల్‌‌ సింగ్‌‌ అన్నాడు. ధ్యాన్‌‌చంద్‌‌ కొడుకు అశోక్‌‌ కుమార్‌‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘బల్బీర్‌‌ మా అందరికీ ట్రూ ఇన్స్‌‌స్పిరేషన్‌‌. ఆయనను, దాదా ధ్యాన్‌‌చంద్‌‌ను పోల్చిచూడొద్దు. తమ కాలాల్లో ఇద్దరూ గ్రేట్‌‌ ప్లేయర్లే. అయితే, బల్బీర్‌‌ సింగ్‌‌కు సరైన గౌరవం లభించలేదని నేను భావిస్తున్నా. కనీసం పద్మ విభూషణ్​ అయినా ఇవ్వాల్సింది’అని అభిప్రాయపడ్డాడు. మరో మాజీ కెప్టెన్‌‌ దిలీప్‌‌ టర్కీ కూడా స్పోర్ట్స్‌‌లో బల్బీర్‌‌ సాధించిన దానికి గౌరవంగా ఆయనకు  పద్మ విభూషణ్​ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ‘బల్బీర్‌‌ సింగ్‌‌ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఒక దేశంగా  మనం ఇప్పటికైనా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వగలం. ధ్యాన్‌‌చంద్‌‌, బల్బీర్‌‌ సింగ్‌‌ లాంటి మహానుభావులు ఒక్కసారే పుడతారు. వాళ్లు సాధించిన ఘనతలను గౌరవించుకోవడం మన కర్తవ్యం. ధ్యాన్‌‌చంద్‌‌, బల్బీర్‌‌ మన దేశ సంపద. ప్రభుత్వం ఇప్పటికైనా వారి విజయాలను, రికార్డులను అధ్యయనం చేసి తగిన విధంగా గౌరవించాలి’ అని సూచించాడు.

ధోని ఆ మ్యాచ్ లో గెలిపించాలని ఆడలేదు

Latest Updates