బట్టతల ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువే : తేల్చిన సైంటిస్ట్ లు

బట్టతల ఎక్కువగా ఉన్న మగవారికి కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉందా..? అంటే అవుననే అంటున్నారు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్లోస్. యూఎస్ లో కరోనా తో ఫిజీషియన్ డాక్టర్ ఫ్రాంక్ గాబ్రిన్ తో పాటు పలువురు డాక్టర్లు చనిపోయారు.

అయితే వారి మరణంపై బ్రౌన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ కార్లోస్ పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు. అంతేకాదు యూఎస్ లో చనిపోయిన డాక్టర్లలో ఎక్కువగా బట్టతల ఉండడం కార్లోస్ పరిశోధనలకు బలం చేకూరింది. ఇక యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో  చనిపోయిన వారి డేటాను పరిశీలించగా కరోనా మరణాలు బట్టతల ఎక్కువగా ఉన్న వారివేనని తేలింది.

బట్టతలకి కరోనాకి సంబంధం ఏంటీ..?

బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందనే అంశంపై ప్రొఫెసర్ కార్లోస్ మాట్లాడుతూ..చైనా, బ్రిటన్ లలో ఎక్కువ శాతం మగవారే  కరోనా సోకి మరణించారని, వారిలో ఎక్కువ శాతం బాధితులకు బట్టతల ఉందని అన్నారు.

బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉండడానికి కారణం వారిలో హార్మోన్ల ప్రభావమేనని యూకేకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ టెలిగ్రాఫ్ కు తెలిపారు. లైఫ్ స్టైల్, స్మోకింగ్, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, శృంగార సమస్యల వల్ల మగవారిలో టెస్టో స్టెరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉందని, అదే హార్మోన్ కరోనా వైరస్, కణాలతో ఫైట్ చేసే శక్తిని ఇస్తుందని తెలిపారు.

స్పెయిన్ లో బట్టతల ఉన్నవారికే కరోనా ఎక్కువగా సోకింది

స్పెయిన్ లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బట్టతల ఉన్నవారికి ముప్పు ఎక్కువగా ఉందా అని పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో స్పెయిన్ లో వైరస్ తో  మరణించిన వారికి, బట్టతల ఉన్నవారికి కరోనా కేసుల్ని క్యాలిక్లేట్ చేయగా.. వారిలో 79శాతం మందికి బోల్డ్ హెడ్ ఉన్న మగవారికే కరోనా ముప్పు ఎక్కువగా ఉందని తేలింది.

అమెరికా, స్పెయిన్ లలో పరిశోధనలు

ప్రొస్టేట్ క్యాన్సర్ సోకే మానవుల్లో TMPRSS2 అనే ప్రొటీన్లు 40శాతం నుంచి 80శాతం వరకు ఉన్నాయి. ఈ ప్రొటీన్లు కరోనా తొందరగా సోకేందుకు సపోర్ట్ చేస్తాయి. TMPRSS2 కరోనా వైరస్ కొమ్ములపై భాగంలో ఉండే పొరల్లో ఈ కణాలు ఉంటాయని .. ప్రొస్టేట్ క్యాన్సర్ సోకిన మానవుల్లో కరోనా సోకుతున్నట్లు తేలింది.

ఇక ప్రొస్టేట్ క్యాన్సర్ సోకే మానవుల్లో TMPRSS2 అనే ప్రొటీన్లు నాశనం చేసే మెడిసిన్ ను కరోనా సోకిన బాధితులకు వినియోగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Latest Updates