ఒక్కో బస్సులో 100 మంది.. మరి వీరికి రాదా కరోనా?

బల్దియా పారిశుద్ధ్య కార్మికుల తరలింపు
20వేల మందికి 25 బస్సులు

హయత్ నగర్, వెలుగు: వీరంతా తెల్లవారు జామునేలేచి సిటీని క్లీన్ చేసేటోళ్లు. కొందరు రోడ్లు ఊడ్చేటోళ్లు. మరికొందరు ఇండ్లలో చెత్తను తీసుకుపోయేటోళ్లు. ఇంకొందరు శానిటైజర్ స్ప్చే చేసేటోళ్లు. కరోనా కల్లోల కాలంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అధికారులు భద్రత కల్పించడం లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నా మన బల్దియా
అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక్కో బస్సులో దాదాపు 100 మంది కార్మికులను కుక్కి నగరంలోని ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. 20 వేల మందికి గాను కేవలం 25 బస్సులను మాత్రమే కేటాయించినట్లు సమాచారం. దీంతోనే ఇలాంటి పరిస్థితి తయారైంది. చాలా వరకు సిటీలోని సఫాయి కార్మికులంతా శివారుల్లోని గ్రామీణ ప్రాంతాల వారే. వీరిలో ఒక్కరికి వైరస్ సోకినా తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. చిరిగిపోయిన గ్లౌజులు, మాస్క్ ధరించాల్సి వస్తుందని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఈస్ట్ జోన్ కార్మిక సంఘం నాయకుడు
ఎం.మహేష్ రెడ్డి కోరారు. కార్మికులను తరలిస్తున్న బస్సుల సంఖ్య పెంచి భద్రతతోపాటు ధైర్యం కల్పించాలన్నారు.

డైలీ 4 కిలోమీటర్లు నడిసొస్తున్న..
ఒక్కో బస్సులో కిక్కిరిసి ప్రయాణిస్తున్నాం. బయట మనిషికి మనిషికి మీటర్ దూరం ఉండాలని చెప్పే అధికారులు మా దగ్గరకు వచ్చేసరికి అది పట్టించుకోవట్లేదు. 100 మంది దాకా ఎక్కిస్తున్నారు. నాణ్యమైన మాస్క్లు ఇయ్యాలే. నేను మారుమూల గ్రామం నుంచి వస్తా. ఇప్పుడు పెట్టిన బస్సు ఎక్కడానికి డైలీ నాలుగు కిలోమీటర్లు నడిసొస్తున్నా.
-వజ్రమ్మ, జీహెచ్‌ఎం‌‌‌‌సీ కార్మికురాలు

For More News..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

విద్యార్థులను ప్రమోట్ చేద్దామా.. పరీక్షలు పెడదామా?

ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టి వేత

Latest Updates