కూరగాయలు అమ్ముతోన్న బాలికా వ‌ధు అసిస్టెంట్ డైరెక్టర్

ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పొట్ట కూటికోసం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.  బాలికా వ‌ధు లాంటి పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన రామ్ వృక్ష‌గౌర్ కు కూర‌గాయ‌లు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నారు.  సినిమా చేయాల్సి ఉండ‌గా టైం దొరికింద‌ని  స్వ‌స్థ‌లం అజంఘ‌డ్‌కు వ‌చ్చానని… అయితే నేనిక్క‌డికి రాగానే లాక్ డౌన్ ప్ర‌క‌టించారని తెలిపాడు. దీంతో మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి వెళ్లే అవ‌కాశం లేకుండా పోయిందన్నాడు. నిర్మాత కూడా ఫోన్ చేసి మ‌న ప్రాజెక్టు ను ఆపేశామని… మ‌ళ్లీ షూటింగ్ మొద‌లు పెట్టాలంటే మ‌రో ఏడాది ప‌ట్టొచ్చ‌న్నారని తెలిపాడు.  దీంతో మా నాన్న కూర‌గాయల వ్యాపారం తాను చేయాల‌ని అప్ప‌డే నిర్ణ‌యించుకున్నానని చెప్పాడు. తోపుడు బండిపై తిరుగుతూ కూర‌గాయలు అమ్ముతున్నానని.. నాన్న చేసే వ్యాపారం గురించి తెలుసునని అందుకే కూర‌గాయ‌లు అమ్ముతున్నానన్నారు. ఇలా కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదని చెప్పుకొచ్చారు రామ్ వృక్ష గౌర్. ఉపాధి లేద‌ని బాధ‌ప‌డకుండా న‌చ్చిన ప‌ని చేసుకుంటే చాలా సంతోషంగా ఉందన్నారు రామ్ వృక్ష గౌర్.

Latest Updates