బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి భారీ ఏర్పాట్లు : తలసాని

హైదరాబాద్‌ : బల్కంపేట అమ్మవారి కల్యాణం జులై 9వ జరగనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం కల్యాణానికి సంబంధించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  జులై 9వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను, పోలీసులను ఆదేశించినట్లు మంత్రి తలసాని తెలిపారు. అమ్మవారి కల్యాణం సందర్భంగా శుక్రవారం ఆలయంలో కల్యాణం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Latest Updates