ఐక్యరాజ్య సమితి ముందు బలూచిస్తాన్ ఉద్యమకారుల ఆందోళన

బలూచ్, పస్థూన్ ఉద్యమకారులు విదేశాల్లో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. స్విట్జర్లాండ్ లోని జెనీవా సిటీలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ఆఫీస్ ముందు పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. అలాగే… జెనీవా సిటీ అంతటా పోస్టర్లు ఏర్పాటు చేశారు. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఓ టెంట్ లో బలూచ్ లో పాక్ ఆకృత్యాలపై సెమినార్ ఏర్పాటు చేశారు. బలూచిస్తాన్ లో తాము చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు ఉద్యమకారులు. వాటిని దాచేందుకే… కశ్మీర్ పేరుతో ఐక్యరాజ్య సమితిలో రచ్చ చేస్తోందని మండిపడ్డారు. బలూచిస్తాన్ కు అంతర్జాతీయ మీడియాను పాకిస్తాన్ అనుమతించగలదా..? అని ప్రశ్నిస్తున్నారు.

Latest Updates