Bambino కంపెనీ తరలింపు.. కార్మికుల ఆందోళన

కర్మాన్ ఘాట్ లోని ప్రముఖ బాంబీనో ఆహార ఉత్పత్తుల ప్యాక్టరీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీని కర్మాన్ ఘాట్ నుంచి యాచారం మండలం పిల్లిపల్లి గ్రామానికి తరలించడాన్ని వ్యతిరేకించారు. కంపెనీ తరలింపుతో 150మంది మహిళా కార్మికులు రోడ్డున పడినట్లు తెలిపారు. దీంతో పాటే… మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న PF ను వెంటనే చెల్లించాలని, ఉద్యోగాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కర్మన్ ఘాట్ నుంచి పిల్లిపల్లి గ్రామానికి వెళ్లి పనిచేయడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కార్మికులు కోరారు. దీంతో పాటే.. రోజూ వారి కూలి కాకుండా.. నెలకు 18వేల జీతాన్ని ఇవ్వాలని, ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఫ్యాక్టరీ గేటు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో పాటే…  ఫ్యాక్టరీలో పని చేస్తున్న మహిళలను సూపర్ వైజర్ వెంకట్రావు వేధిస్తున్నారని కంపెనీ చైర్మన్ కిషన్ రావుకు ఫిర్యదు చేశారు.

Latest Updates