ఆమె రాస్తే ర్యాంకే..

వచ్చేసరికి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ సబ్జెక్టులు ఎంచుకున్నా.  14 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌‌లో టాప్​ ర్యాంకులు కొట్టా.

ఒక్కటే టార్గెట్ సివిల్స్.. దానికోసం ఏ సబ్జెక్ట్ అయినా అధ్యయనం చేయాలి. లోతుగా తెలుసుకోవాలి.. విశ్లేషణ చేయాలి. అందుకే ఇంటర్‌‌‌‌లో బైపీసీ తీసుకున్నా అన్ని సబ్జెక్టులు తెలుసుకోవడం కోసం డిగ్రీలో ఆర్ట్స్ కోర్సును ఎంచుకుంది. పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే స్టేట్ లెవల్, సెంట్రల్ లెవల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలన్నింటిలో టాప్‌‌లో నిలిచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌‌లో  సత్తా చాటింది మెదక్ పట్టణానికి చెందిన బండ సుష్మారెడ్డి.

సివిల్స్​ సాధించాలంటే ఆర్ట్స్​, సైన్స్​ సబ్జెక్టులపై పూర్తి పట్టు ఉండాలని తెలుసుకున్నా. అందుకే ఇంటర్‌‌‌‌లో బైపీసీ చదివినా డిగ్రీకి వచ్చేసరికి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ సబ్జెక్టులు ఎంచుకున్నా. 2018–19లో డిగ్రీ పూర్తయింది. మే నుంచి అన్ని వర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టా. వాటి ద్వారా సబ్జెక్టు పైన అవగాహన పెరగడమే కాకుండా క్వశ్చన్ ఫ్రేమింగ్ తెలుస్తుంది. అలా స్టేట్ లెవల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కాకుండా సెంట్రల్ ఎగ్జామ్స్ రాశా. అందులో లాసెట్​లో స్టేట్​ లెవల్​లో 101 ర్యాంకు రాగా, ఎడ్‌‌సెట్‌‌లో స్టేట్ 36వ ర్యాంకు వచ్చింది. ఎం.ఏ. (పొలిటికల్ అండ్​ ఇంటర్నేషనల్​ రిలేషన్స్)​ ఎగ్జామ్ లో 6వ ర్యాంకు, ఎమ్మెస్సీ జియోగ్రఫీ ఎంట్రెన్స్‌‌లో 8వ ర్యాంకు, ఎం.ఏ. ఆంత్రపాలజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్​లో ఆలిండియా 5వ ర్యాంకు వచ్చాయి. ఇవి కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, తెలుగు, సోషియాలజీ సబ్జెక్టుల్లోనూ టాప్‌‌ ర్యాంక్స్ వచ్చాయి.

ఇవి కాకుండా సెంట్రల్ వర్సిటీ లెవల్లో  జేఎన్‌‌యూ ఢిల్లీ నిర్వహించిన ఎన్విరాన్​మెంటల్​ సైన్స్​ ఎంట్రెన్స్​లో ఆలిండియా లెవల్​లో 7వ ర్యాంకు, సెంట్రల్​ యూనివర్సిటీ (సి.యు.సెల్​)లో ఎమ్మెస్సీ (జియో ఇన్ఫర్మేటిక్స్) లో ఎంట్రెన్స్​ ఎగ్జామ్​లో ఆలిండియా 5 వ ర్యాంకు వచ్చింది.  ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీ ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్ చదువుతున్నా. నాన్న బండ కృష్ణారెడ్డి మెదక్‌‌లో ఫర్టిలైజర్ షాపు చూసుకుంటున్నారు. అమ్మ యశోదర ఇంట్లోనే ఉంటుంది. పీజీ పూర్తవ్వగానే ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకుంటా. కలెక్టర్‌‌‌‌గా నన్ను నేను చూసుకోవాలన్నదే నా అంతిమ లక్ష్యం. – మెదక్​, వెలుగు

Latest Updates