చదువుతోనే పేదరిక నిర్మూలన, దేశ ప్రగతి

చదువుతోనే పేదరిక నిర్మూలన, దేశ ప్రగతి సాధ్యమన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. యువతకు విలువలతో కూడిన ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన దత్తాత్రేయ ఏకలవ్య ఆశ్రమాన్ని సందర్శించి విద్యార్ధులతో మాట్లాడారు. స్టూడెంట్స్ తో కలిసి మొక్కలు నాటారు. తర్వాత ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్ధులకు పట్టాలను అందించారు.

Latest Updates