రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి పెరిగితే చర్యలేవి?

టీఆర్ ఎస్  ప్రభుత్వం పై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీరు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆగస్ట్ 15 తర్వాత అసలైన పాలన చూస్తరని సీఎం చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి పెరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నీటి పారుదల, ఎక్సైజ్ సహా పలు శాఖల్లో భారీగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి  ఆదరణ పెరుగుతోందని… మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Latest Updates