అమరుల సాక్షిగా విమోచనదినోత్సవాన్ని జరపాలి: బండి సంజయ్

వీర బైరన్ పల్లి అమరవీరుల గుర్తుగా సెప్టెంబర్17ను విమోచన దినోత్సవం జరుపలని అన్నారు బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బైరాన్ పల్లి అమరుల కుటుంబాలను పరామర్షించడానికి తీరిక లేని సీఎం కేసీఆర్… నిజాం నవాబును మాత్రం దేవుడని అంటాడని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఇటీవలే… బైరాన్ పల్లి కుటుంబాలను ఘనంగా గౌరవించుకున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోషయ్యను సెప్టెంబర్ 17 ను అధికారికంగా విమోచన దినంగా జరపమన్న కేసీఆర్ వారి హయంలో మాత్రం సప్పుడుజేయకుండ ఉన్నారని అన్నారు. మేదావుల సలహా మేరకే విమోచన దినోత్సవాన్ని జరపడంలేదని కేసీఆర్ అనడం సిగ్గుచేటని అన్నారు బండి సంజయ్.

Latest Updates