MIM స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం : బండి సంజయ్

కరీంనగర్ పట్టణం.. SRR గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కేంద్రప్రభుత్వ వాటాలేని ఒక్క పథకం కూడా తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. 2లక్షల ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తీసుకొస్తామన్నారు. స్మార్ట్ సిటీకి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం ఈ నగరాన్ని డస్ట్ సిటీగా మార్చిందన్నారు.

తాను గెలుస్తానని భయపడే కేసీఆర్ హిందూత్వ కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు బండి సంజయ్. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయనీ… తాము అధికారంలోకి వస్తే MIM స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని అన్నారు. కరీంనగర్ లో బీజేపీ విజయం ఖాయం అన్నారు బండి సంజయ్.

 

Latest Updates