ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలి

ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు రైతులకు మద్దతుగా చేపట్టిన ఉపవాస దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విరమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. పంటను కొనుగోలు చేసేది కేంద్ర‌మే అయితే .. ప్రతి గింజను మేమే కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు ప్రకటించింది.? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మోనార్క్ పాలన కొనసాగుతోందన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలని ఎంపీ డిమాండ్ చేశారు . రైతులు ఆందోళన చెందొద్దని బీజేపీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆర్నబ్ గోస్వామిపై జరిగిన‌ దాడిని ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్ . దేశం కోసం, ధర్మం కోసం, హిందూత్వం కోసం అన్న శివసేన ముఖ్యమంత్రి సాధువుల హత్యని చిన్న ఇష్యూ గా తీసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోన్ చేసి రిపోర్ట్ అడిగే వరకు ఆయ‌న‌ స్పందించలేదన్నారు.

Latest Updates