సీఎం కేసీఆర్ వేల పుస్తకాల చదువు ఇదేనా.?

ఢిల్లీ: పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఏవిధంగా తెలంగాణ అసెంబ్లీలో వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ఆ తీర్మానాన్ని చెత్త బుట్టలో వేయాలన్నారు. సోమవారం CAA, NPR, NRC వ్యతిరేక తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడంపై ఎంపీ మండిపడ్డారు. CAA,NRC లను వ్యతిరేకించడం అంటే దేశ ద్రోహం చేసినట్టేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు.

ప్రజా సమస్యలకు ఉపయోగించే అసెంబ్లీని.., రజాకార్ల ఎజెండా కోసం ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న కేసీఆర్.. CAA,NRC లను వ్యతిరేకంగా తీర్మానం చేయటం ఏంటని ప్రశ్నించారు. ఇదేనా ఆయన చదువంటూ ఫైర్ అయ్యారు.  ఢిల్లీ అల్లర్ల గురించి మాట్లాడుతున్న సీఎం.. మరి భైంసా గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. బర్త్ సర్టిఫికెట్ లేకుండా ఇన్ని రోజులు ఎలక్షన్‌లలో ఎలా పోటీ చేశారన్నారు. సమగ్ర సర్వే ద్వారా ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. MIM ని భుజాన వేసుకొని… మైనారిటలకు కొమ్ము కాస్తున్నారన్నారు సంజయ్.

Bandi Sanjay comments on TS Assembly passes the Anti CAA resolution

Latest Updates