కేసీఆర్ క్షమాపణ చెప్పి పొర్లుదండాలు పెట్టాలి

యాదాద్రి ఆలయ స్థంభాలపై  కేసీఆర్ ఫోటోలు చెక్కడాన్ని తప్పుబట్టారు ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించి క్షమాపణ చెప్పి..పొర్లు దండాలు పెట్టాలన్నారు. వేములవాడలోని వినాయకుడి వద్ద ఎంపీ బండి సంజయ్ పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పవిత్రమైన దేవాలయంపై సీఎం కేసీఆర్ ఫోటోలు, పార్టీ ఫోటోలు ప్రదర్శించడం దారుణమన్నారు. హిందు సమాజం పట్ల కేసీఆర్ కి చులకన ఉందన్నారు. హిందు దేవాలయం కేంద్రంగా రాజకీయ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. చర్చిలో మసీదులో కేసీఆర్  ఇలానే చేయగలడా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అర్చకులతో కలిసి ఫోటోలు తొలగించి, పాలాభిషేకం చేయాలన్నారు. అప్పుడే హిందు సమాజం క్షమిస్తుందన్నారు. లేకపోతే హిందువులు అడుగడుగునా అడ్డుకుంటారన్నారు సంజయ్

Latest Updates