సీఎం అబద్దాలకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి

హైదరాబాద్ : దేశం కోసం ధర్మం కోసం పేదల కోసం బీజేపీ పని చేస్తుందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం  సైదాబాద్ రోడ్ షోలో మాట్లాడారు సంజయ్. ఆయనతో పాటు మాజీ మండలి చైర్మైన్ స్వామిగౌడ్ కూడా ప్రచారంలో పాల్గాన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్.. రేపు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ జోకర్ గా మాట్లాడతాడని..సీఎం అబద్దాలకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలన్నారు. బీజేపీకి ఆదరణ ఎక్కువ వస్తుందన్న సంజయ్..సీఎం కాషాయ వస్త్రాలు వేసుకొని తన పేపర్ లో వేసుకుని నేను కూడా హిందూ అంటున్నాడన్నారు. భైంసాలో నిరుపేద హిందువులపై దాడి చేశారని..దేశద్రోహుల పార్టీ MIMతో కలిసి కెసీఆర్ చెట్టపట్టలేసుకొని తిరుగుతున్నాడన్నారు. మందు తాగి బండి నడిపితే నేరమైనపుడు.. మందు తాగి ప్రభుత్వాన్ని నడపడం కూడా నేరమే అన్నారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చి నేను ప్రమాణం చేస్తే… కేసీఆర్ మాత్రం భయపడి ఇంట్లో ఉన్నాడన్నారు. కాశాయపు జెండాని హైదరాబాద్ పై ఎగరేస్తామన్న ఆయన..దేశ విద్రోహ శక్తులపై తప్పనిసరి సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు. మాకు అవకాశం ఇస్తే హైదరాబాద్ లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళని బయటకి గుంజి చట్టానికి అప్పగిస్తామన్నారు. హిందు ధర్మానికి అవమానం జరిగితే ఊరుకొమని..ఈ దేశం తిండి తిని పక్క దేశం పాట పాడేవాడ్ని ఈడ్చి కొడతామని తెలిపారు.

డబుల్ బెడరూమ్స్ కోసం 3,500 కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందని..బీజేపీకి అవకాశం ఇస్తే అర్హులకు డబుల్ బెడరూమ్స్ ఇస్తామన్నారు. క్యాబినెట్ లో ఉన్నవారంతా పేరుకే మంత్రులని..సిటీలో అంతా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలే ఫ్లెక్సీలపై ఉన్నాయన్నారు. మమ్మల్ని గెలిపిస్తే రూ. 25 వేల వరదసాయం అందిస్తామని..ఉచితంగా కారోనా వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. లక్ష నలభై వేల మంది ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు రోడ్డుపై పడ్డారని..రూ. 300 కోట్లు ఇచ్చి అదుకోలేకపోతున్నారన్నారు. బీజేపీకి మేయర్ అప్పగిస్తే వారందరినీ ఆదుకుంటామని చెప్పారు.  ఆటో డ్రైవర్స్ అందరికీ ప్రతి సంవత్సరం రూ. 7 వేలు ఇస్తామన్నారు. ప్రతీ మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామన్న బండి సంజయ్..హైదరాబాద్ లో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ దరిద్రంగా మారిందన్నారు. కేసీఆర్ బహిరంగ సభలో గతంలో ఇచ్చిన మేనిఫెస్టో గురించి చదవాలన్నారు. ఓటింగ్ జరగకుండా ఉండడానికి సీఎం, కొందరు పోలీస్ అధికారులు.. దుష్టశక్తులు ఉన్నాయని ఓటర్లను భయపెడుతున్నారన్నారు. కేటీఆర్ అన్ని కులాల మీటింగ్స్ పెట్టి కార్పొరేషన్స్ ఇస్తామని ఆశ చూపెడతాడన్నారు. కేసీఆర్ ఒక పాస్పోర్ట్ బ్రోకర్ అని..LRS పోవాలంటే బీజేపీ రావాలని.. వందకోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్నాడన్నారు బండి సంజయ్.

Latest Updates